జబర్దస్త్’ కామెడీ షో నుంచి మెగా బ్రదర్ నాగబాబు పూర్తిగా బయటికి వచ్చేసిన తరువాత జబర్దస్థ్ లోకి ఆయన లేని లోటు ఇప్పటికి కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రోగ్రామ్‌కు ఎవరి సహకారం లేకున్నా, తనదైన శైలిలో ఒంటి చేత్తో లాక్కుంటూ వస్తోంది. ఐతే.. నాగబాబు ఎపుడైతే.. ఈ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పాడో.. అప్పటి నుంచి ఎవరైనా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం జబర్దస్త్ షోకు వస్తే వాళ్లే ఆ సీటులో కూర్చుంటున్నారు. గడిచిన ఈ రెండు వారాలు నాగబాబు ప్లేస్‌లో కమెడియన్ ఆలీ.. జబర్ధస్త్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తుండగా ఈ వారం మాత్రం ఆలీ ప్లేస్‌లో యాంకర్‌గా వ్యవహరించే అనసూయ జడ్జ్‌గా హాట్ సీట్లో కూర్చొని నవ్వుల పువ్వులు పూయిస్తందని ప్రమోలొ కనిపిస్తోంది.
తాజాగా ప్రసారమయ్యే జబర్ధస్త్ ఎపిసోడ్‌లో పోసాని కృష్ణమురళి..స్పెషల్ గెస్ట్‌గా . ఒక కంటెస్టెంట్‌గా ఓ స్కిట్ కూడా చేసి ఆడియన్స్‌ను అలరించనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసారు. మొత్తానికి వెండితెరపై నటుడిగా సత్తా చూపెట్టిన పోసాని కృష్ణమురళి.. జబర్దస్త్ షోలో అదే ఊపు కంటిన్యూ చేయనున్నాడా..? లేదా..? అనేది వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa