స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా ‘అడ్డా’ చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో నిర్మాత భార్గవ్ మన్నె నిర్మిస్తున్న చిత్రం “హీరో హీరోయిన్”. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా “హీరో హీరోయిన్” చిత్రం నుండి పర్వట్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్. అమ్మాయిలను టీజ్ చేస్తూ సాగే ఈ సాంగ్ క్యాచీ గా ఉంది. అనూప్ సంగీతం, పూర్ణ చారి సాహిత్యం బాగుంది. పైరేటెడ్ లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కార్తీక్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa