'వెంకీమామ' మొదటి వారం సక్సెస్ ఫుల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెకండ్ వీక్ లోకి ఎంటరైనది. కాగా మొదటి వారానికి గాను నైజాంలో 8.5 కోట్ల షేర్ సాధించింది. ఇక నిన్న నాలుగు చిత్రాలు విడుదల కావడంతో వెంకీ మామకు పోటీ ఎక్కువైంది. మరి ఈ వీకెండ్ వెంకీ మామ చిత్రం ఏ మాత్రపు వసూళ్లతో ముగిస్తుందో చూడాలి. వెంకీమామ సందడి అనుకున్నదానికంటే ఎక్కువగా ఉంది..నాగ చైతన్య , వెంకటేష్ హీరోలుగా నటించిన ఈ సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు పరుగులు పెట్టిస్తుంది. ఎమోషనల్ , కామెడీ , లవ్ ఇలా అన్ని ఉండడం తో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మామాఅల్లుళ్ల వసూళ్లు కుమ్మేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa