ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముక్కాలా.. ముక్కాబులా’..రీమిక్స్‌ దుమ్ములేపింది

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 09:23 PM

డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం ‘ప్రేమికుడు’. ఈ సినిమాలో నగ్మా హీరోయిన్‌గా నటించింది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలోని ‘ముక్కాలా.. ముక్కాబులా’ అనే పాటకు ప్రభుదేవా వేసిన డ్యాన్స్‌ అప్పట్లో ఆడియన్స్‌ చేత విజిల్స్‌ వేయించింది. తాజాగా ఈ పాటను బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఓ చిత్రం కోసం రీమిక్స్‌ చేశారు. డ్యాన్స్‌ మాస్టర్‌ రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డి’. ఇటీవల ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ‘ముక్కాలా.. ముక్కాబులా’ పాట రీమిక్స్‌ వీడియోను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో వరుణ్‌ ధావన్‌, శ్రద్ధాకపూర్‌తోపాటు ప్రభుదేవా మాస్టర్‌ డ్యాన్స్‌ చేస్తూ అలరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ప్రభుదేవా మాస్టర్‌ అదరగొట్టేశారు.’, ‘ప్రభుదేవా మాస్టర్‌ ఎనర్జీ సూపర్బ్‌’, ‘చాలా అద్భుతంగా ఉంది’ అని కామెంట్లు పెడుతున్నారు.


డాన్స్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుదేవా ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన ABCD (Anybody Can Dance), ABCD2, చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ తరుణంలో అదేకోవలో ఈ ‘స్ట్రీట్‌ డ్యానర్‌ 3డి’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa