బాలీవుడ్ భామ క్రిజిల్ డిసౌజా ప్రస్తుతం గోవా లో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అందుకే అక్కడి నుంచి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘నువ్వు సంతోషంగా ఉన్నావనుకో.. అది నీ పళ్లు చెప్తాయి” అంటూ ఎంతో సింపుల్ గా ఉండే సూత్రం చెప్పింది. ఈ ఫోటోలో బ్లాక్ టాప్.. బ్లాక్ అండ్ వెయిట్ డిజైన్ ఉండే మిడ్డీ ధరించి అందాలను ఆరబోసింది. నిలుచున్న పోజు అందంగా లేదు కానీ నెటిజన్లు అవి పట్టించుకోరు కదా. ఈ ఫోటోకు భలే కామెంట్లు వచ్చాయి. “క్రిస్టల్ క్లియర్ వ్యూ”.. “మైండ్ బ్లోయింగ్”.. “బ్యూటిఫుల్ స్మైల్..హాట్ డ్రెస్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa