సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ఓపెనింగ్స్ మాత్రం గొప్పగా రాలేదు. కానీ, సినిమా అయితే హిట్ అనే టాక్ మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. అందుకే, ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకున్నాయి. ఎ సెంటర్లలో మంచి కలెక్షన్లను వస్తున్నాయి. శుక్రవారం మొదటిరోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొత్తానికి కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. మూడు రోజుల థియేట్రికల్ రన్ లో టికెట్ కౌంటర్లలో ఆకట్టుకునే గణాంకాలనే నమోదు చేసింది. మూడు రోజులకు గానూ రూ .8.63 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది.ఈ చిత్రం యుఎస్ లో $ 200 కె డాలర్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
మొదటి మూడు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు
నైజాం-Rs 3.70 కోట్లు
సీడెడ్-Rs 1.09 కోట్లు
ఉత్తరాంధ్ర-Rs 1.04 కోట్లు
కృష్ణ -Rs 0.62 కోట్లు
గుంటూరు-Rs 0.66 కోట్లు
నెల్లూరు-Rs 0.34 కోట్లు
ఈస్ట్ -Rs 0.69 ఈస్ట్
వెస్ట్- Rs 0.52 కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ మొదటి రెండు రోజుల షేర్-Rs 8.63 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa