బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటి మీనా తాజాగా సాక్ష్యం సినిమాలో నటిస్తోంది. శ్రీవాసు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను అభిషేక్ నమ నిర్మిస్తున్నాడు. బెల్లం కొండ శ్రీనివాస్ పూజా హెగ్డే హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజా సమాచారం మేరకు మీనా ఈ సినిమాలో హీరో మదర్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ను విడుదల చెయ్యబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మద్య ప్రకటించింది. తాజా సమాచారం మేరకు వేసవిలో ఈ మూవీని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తునట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa