ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం కిర్రాక్ అనేలా టైటిల్ సిద్దం చేశారు టీమ్. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘సీటీమార్’ అనే పేరును అనుకుంటున్నారట. చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో ఉండటం, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో చిత్రానికి ఈ టైటిల్ బాగా యాప్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను ‘యు టర్న్’ నిర్మాత శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయకిగా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa