ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి మొదటివారంలో 'రథేరా'!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 26, 2019, 06:22 PM

పులా సిద్దేశ్వర్ రావ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న  జాకట రమేష్  దర్శకత్వంలో వస్తున్న చిత్రం రథేరా. పూల సిద్దేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటుడు పృద్వి మాట్లాడుతూ… అమీర్ ఖాన్ చేసిన దంగల్ చిత్రం తరహాలో రథేరా చిత్రం ఉండబోతోంది. టీజర్ చాలా బాగుంది, లోకల్ ట్యాలెంట్ తో అందరూ కొత్తవారు చేసిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని డైలాగ్స్ ను రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చు, అంత క్యాచీగా ఉన్నాయి డైలాగ్స్. సినిమా హిట్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను అన్నారు. ఈ సందర్బంగా నిర్మాత మరియ హీరో జుకేట్ రమేష్ మాట్లాడుతూ…. ఖోఖో నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా కొత్తగా ఉంటుంది. మా సినిమా టీజర్ ను విడుదల చేసిన వి.వి.వినాయక్ గారికి ప్రేత్యేక ధన్యవాదాలు. టీజర్ చూసిన అందరూ బాగుంది అంటున్నారు. జనవరి 2020 మొదటివారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్రం చేస్తున్నాము, ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ బాగా చేశారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలువుతాము అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa