విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య నటించిన 'వెంకీమామ' చిత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. వెంకీమామ' రెండో వారం సక్సెస్ ఫుల్ రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మూడొవ వీక్ లోకి ఎంటరైనది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 72 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. కాగా ఈ సినిమాలో వెంకటేశ్ కామెడీ యాక్షన్ నాగ చైతన్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించారు. బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa