సీనియర్ స్టార్ నాగార్జున టైటిల్ పాత్రలో అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నం.6గా రూపొందుతోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో నాగార్జున లుక్ డిఫరెంట్‌గా ఉంది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఎ ఆఫీసర్‌గా నటిస్తున్నారని ఫస్ట్‌లుక్ చూస్తే తెలుస్తోంది.
నిజ ఘటనల ఆధారంగా చేసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ వర్మ పాత్రలో ఆయన నటిస్తున్నారు. అసిస్టెంట్ కమీషర్ ఆఫ్ పోలీస్ విజయ్‌వర్మను పోలీస్ శాఖలో అందరూ ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ డైలాగ్స్ రాశారు. షానియల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌ః డేవిడ్ ఇస్మాలోనె, ఎడిటర్‌ః శ్రవణ్ కేతికానేని, ఆర్ట్‌ః మురళి ఎస్.వి, విఎఫ్‌ఎక్స్‌ః యుగంధర్.టి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa