బాహుబలి చిత్రంతో ఘన విజయం సాధించిన నిర్మాత శోభు యార్లగడ్డ తమ నుండి రాబోతున్న కొత్త చిత్రాన్ని ప్రకటించారు.సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈచిత్రానికి “ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య” అనే టైటిల్ ఖరారు చేశారు.℅ కంచరపాలెం చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకట్ మహా దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కనుంది.ఈసందర్భంగా ఒక వీడియోను విడుదల చేశారు.వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.నరేష్ కూడా ఈచిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.ఈచిత్రాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని శోభు యార్లగడ్డ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa