హీరో సిద్ధార్థ్ వివిధ రాజకీయ అంశాలపై తన భావాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు. నాయకుల అవినీతిని ప్రశ్నిస్తుంటాడు. దీంతో సిద్ధార్థ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు మొదలయ్యాయి. సిద్ధార్థ్ తాజాగా నటించిన `టక్కర్` సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికతో తాజాగా సిద్ధార్థ్ మాట్లాడాడు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని వెల్లడించాడు. `రాజకీయాల్లో రాణించాలంటే చాలా తెలివితేటలుండాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నా లాంటి వారు రాజకీయాలకు పనికిరారు. రాజకీయ నాయకుడిని కావాలనే ఉద్దేశం నాకు లేదు. సోషల్ మీడియాలో నేను పెట్టే పోస్టులు కేవలం నా అభిప్రాయాలు మాత్రమేన`ని సిద్ధార్థ్ చెప్పాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa