అరుంధతి సినిమా వచ్చి ఏడేనిమిదేండ్లయినా ఇప్పటికి ఆ సినిమాలో వదల బొమ్మాలి వదలా అనే డైలాగ్ వచ్చినప్పుడు నువ్ నన్ను ఏం చేయలేవురా అని అనుష్క పవర్ఫుల్ గా చెప్పిన డైలాగ్ కూడా ఎవరూ మర్చిపోలేదు.
ఆ వాయిస్ మాత్రమే కాదు సౌందర్య,ఆమని ఇంకా మరికొంత మంది హీరోయన్ల నటన వెనుక ఉన్న గొంతు అలనాటి బుల్లితెర నటి శిల్ప ది. శిల్ప మొదట దూరదర్శన్ లో సీరియల్స్ లో నటించేది. ఆ తరవాత సినిమాలలో పర బాషా నటులకు డబ్బింగ్ చెప్పటం ప్రారంభించింది.సౌందర్య నటించిన ప్రతి సినిమాకి శిల్ప డబ్బింగ్ చెప్పింది.
సౌందర్య కూడా శిల్ప చేత డబ్బింగ్ చెప్పించమని మరీ చెప్పేవారట.అలాగే అనుష్క ప్రతి సినిమాకి శిల్ప డబ్బింగ్ చెప్పేది. ఒక పాత్ర పండాలంటే ఆర్టిస్ట్ హావభావాలతో పాటు డబ్బింగ్ కూడా ముఖ్యమే. శిల్ప డబ్బింగ్ అనుష్క పాత్రలకు ప్రాణం పోస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
శిల్ప చదువుకొనే రోజుల్లో తల్లి ప్రోత్సాహంతో టెలివిజన్ సీరియల్స్ లో నటించేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా డబ్బింగ్ వైపు అడుగుపెట్టారు.మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన శిల్ప అశ్విని నాచప్ప నటించిన అశ్విని సినిమాలో అశ్విని క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడంతో మెయిన్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు.
అప్పుడు మొదలైన ప్రయాణం నేటికి కొనసాగుతుంది. భర్త మహర్షి రాఘవ.అతను కూడా బుల్లితెర నటుడే. వీరిది ప్రేమ వివాహం.వీరికి ఒక కుమారుడు రుద్రాక్ష్. అమెరికాలో బిబిఎ చదువుతున్నాడు. నటించినప్పటికీ వాయిస్ సరిగా లేకపోతే పాత్ర తేలిపోతుంది.
ముఖ్యంగా వేరే భాషల నుండి వచ్చే హీరోయిన్సే టాలివుడ్లో ఎక్కువగా ఉన్నారు అలాంటప్పుడు వారికి వాయిస్ చెప్పాల్సిన బాద్యత డబ్బింగ్ ఆర్టిష్ట్ లపైన ఉంటుంది. తొలితరం టెలివిజన్ తారల్లో శిల్ప ఒకరు.
మొట్టమొదటి సీరియల్ హీరోయిన్ కూడా ఈవిడే…సౌందర్య ప్రతి సినిమాకు వాయిస్ అందించింది శిల్పనే.నాకు డబ్బింగ్ చెప్తే శిల్పనే చెప్పాలి లేదంటే మరెవరూ వద్దు అని సౌందర్య అనేవారంటే ఆమె వాయిస్ కి ఉన్న ప్రత్యేకత అర్దం చేసుకోవచ్చు.
అనుష్క నటించిన ప్రతి సినిమాలో కూడా అనుష్క వాయిస్ శిల్పదే.ఇప్పటివరకూ ఎవరూ తీసుకోనన్ని నంది అవార్డులు శిల్ప అందుకున్నారు. నటిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పది నందులు తీసుకున్న ఘనత ఆమెది.నటిగా ఐదు నందులు,డబ్బింగ్ ఆర్టిస్టుగా ఐదు నందులు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ వెయ్యి సినిమాల వరకు డబ్బింగ్ చెప్పారు శిల్ప.
తన మాటల్లో :--
డబ్బింగ్ ఆర్టిస్టుగా నాకు సంతృప్తినీ, ఫీల్ గుడ్‌నీ ఇచ్చింది 'దృశ్యం'. ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కుటుంబానికి కష్టం వస్తే ఎలా స్పందిస్తానో అలానే అనుకొని ఆ సినిమాలో డబ్బింగ్ చెప్పా. మీనా ఏడ్చే సన్నివేశాల్లో చాలా సందర్భాల్లో నేనూ నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నా. ఫీల్ అయితే తప్ప ఏ సన్నివేశానికైనా గొంతులో సహజత్వం రాదనేది నా అభిప్రాయం. ఇంతకీ నేను ఈ రంగంలోకి ఎలా వచ్చానో తెలుసా.... మా నాన్న ప్రభుత్వోద్యోగి. ఉద్యోగరీత్యా నర్సరావుపేట నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. మా అమ్మ కథలు రాసేది. తను రాసిన వాటిని నేను చదివి ఇంట్లో వాళ్లకి వినిపించేదాన్ని. టీవీ చూసినప్పుడు ఆ పాత్రని నేనైతే ఎలా చేసేదాన్నో వూహించుకొనేదాన్ని ఎలాగైతేనేం... పదో తరగతికి వచ్చేసరికి నటిని కావాలనే కోరిక మనసులో బలంగా నాటుకుపోయింది. నాన్నకి చెబితే 'చక్కగా చదువుకోక నీకెందుకమ్మా ఆ రంగం' అన్నారు. అలిగి అన్నం తినడం మానేశా. నాన్న బాధపడ్డారు. చివరికి ఆడిషన్‌కి వెళతా. ఎంపిక కాకపోతే మీరు చెప్పినట్టే చదువుకుంటానని చెప్పి ఒప్పించా. అమ్మ మాత్రం నావైపే. నన్ను ఆడిషన్లకు తీసుకెళ్లేది. మైత్రేయి అనే నా పేరును శిల్పగా మార్చింది. తెలుగులో స్పష్టత, డైలాగులు చెప్పడం వంటివి నాకు ప్లస్ పాయింట్లు అయ్యాయి. అవే ఆడిషన్‌లో ఎంపికవ్వడానికి కారణం. దూరదర్శన్‌లోనా మొదటి సీరియల్ 'అనగనగా ఓ శోభ'. ఆ తరవాత 'పెళ్లిచూపులు', 'బుచ్చిబాబు', కన్యాశుల్కం', 'ఆనందో బ్రహ్మ'... ఇలా చాలానే! ఒక్క ధారావాహికలేంటి, వ్యాఖ్యాతగానూ చేశా. సందేశాన్నిచ్చే ప్రభుత్వ ప్రకటనలూ చేసేదాన్ని. మరో వైపు నాన్న సూచన మేరకు దూరవిద్యలో డిగ్రీ చదివా.
నటించిన కొన్ని సినిమాలు :ఆపద్భాందవుడు ,జంబలకిడి పంబ , యుగకర్తలు , మిస్టర్‌పెళ్లాం', 'తొలిప్రేమ', 'నరసింహ', 'పాండురంగడు', 'పంచాక్షరి', 'స్వరాభిషేకం', 'రాజన్న', 'ఉలవచారు బిర్యానీ', 'దృశ్యం', 'గాలిపటం'
డబ్బింగ్ : కొన్ని సినిమాలు - సీరియల్స్ ,---'ఉషాకిరణ్ మూవీస్' వాళ్లు 'అమ్మ'లో కావ్య అనే అమ్మాయికి డబ్బింగ్ చెప్పమని పిలిచారు. తరవాత 'పీపుల్స్ ఎన్‌కౌంటర్', 'అశ్విని'.. ఇలా ఆ బ్యానర్‌లోనే అవకాశాలు వరసగా వచ్చాయి. దాదాపు తొంభైల్లో వచ్చిన సినిమాల్లో సగానికిపైన నేనే డబ్బింగ్ చెప్పా. టబు, మనీషాకొయిరాలా, రవీనాటాండన్, ప్రీతిజింతా, అంజలాఝవేరి... వంటి వారికీ డబ్బింగ్ చెప్పారు . అంతరంగాలు ,మేఘమాల , అరుందతి , మిస్టర్ పెళ్ళాం , రభస.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa