దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ 11న విడుదలైంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. అయితే మహేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని మహేష్ రోల్ కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహేష్ ఈ సినిమాలో స్పై పాత్రలో నటించబోతున్నారట. అయితే మహేష్ బాబు ఇప్పటికే ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమాలో స్పై రోల్ లో నటించినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయినప్పటికీ మహేష్ బాబు మళ్లీ ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా అలాంటి స్పై పాత్రలోనే నటించాలనుకోవడం నిజంగా విశేషమే. ఏప్రిల్ నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక వంశీ, మహేష్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa