చెందు ముద్దు దర్శకత్వంలో సంజయ్, నిత్యా శెట్టి, విశ్వంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ఓ పిట్టకథ. బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. ఓ పిట్టకథ ఫస్ట్ లుక్ ని ఆసక్తికరంగా డిజైన్ చేశారు. భవ్య క్రియేషన్స్ లో తెరకెక్కుతోన్న చిత్రం ఓ పిట్టకథ. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన త్రివిక్రమ్-అల్లు అర్జున్ ల చిత్రం అల.. వైకుంఠపురంలోబ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే. సంక్రాంతి విజేత అనిపించుకుంది. ఏకంగా రూ. 150కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ ఆనందంలో ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa