నా పారితోషికం నాకు అందిందా లేదా అనే విషయాన్ని మాత్రమే కాదు, నా పాత్రకి నేను న్యాయం చేశానా లేదా అనేది కూడా ఆలోచిస్తానని నటి పూజాహెగ్డే రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో తెలిపింది. సినిమా విడుదలైన తరువాత జయాపజయాలతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండను. ఆ సినిమా ఏ ఏరియాల్లో ఎలా ఆడుతుందో కనుక్కుంటాను. లాభనష్టాలను గురించి తెలుసుకుంటాను. ఎందుకంటే నేను వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చిన దానిని. అందుకే నా నిర్మాతలు బాగుండాలనీ, వాళ్లు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందనే కోణంలో ఆలోచిస్తానని తెలిపింది. కొంతమంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కే రాని ఈ రోజుల్లో పూజ ఇలా ఆలోచిస్తుందంటే గ్రేటే అని నెటిజన్స్ కొనియాడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa