బిగిల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది నటి వర్ష బొల్లమ్మ . తొలి సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా ఛాలెంజింగ్ రోల్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ బ్యూటీ టాలీవుడ్ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ హీరోగా నటించిన చూసి చూడగానే సినిమా తో స్ట్రెయిట్ నాయిక గా పరిచమవుతుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే శర్వానంద్-సమంత జంటగా నటిస్తోన్న జాను సినిమా లోనూ వర్ష బొల్లమ్మ ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. అయితే ఈ రెండు సినిమాల ఫలితాలు ఇంకా తేలకముందే అమ్మడు మరో ఛాన్స్ చేజిక్కించుకుందట. దొరసాని ఫేం ఆనంద్ దేవరకొండ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ అందుకున్న విషయం ఆలస్యంగా రివీలైంది. వర్ష తన మూడవ సినిమాలో ఆనంద్ సరసన నటిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో అమ్మడు గుంటూరు గాళ్ గా కనిపించనుందిట. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి గా తెలుగు ప్రేక్షకులను ఆ పాత్ర ఆకట్టుకుంటుందని ధీమాను వ్యక్తం చేసింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa