ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జాను’ ...మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : నేచుర‌ల్ స్టార్ నాని

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2020, 01:14 PM

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. నేచుర‌ల్  స్టార్ నాని, వంశీ పైడిప‌ల్లి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ...


మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా :  నాని


నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ‘‘రాజుగారితో పాటు నాకు ఈ సినిమాను చూడ‌మ‌న్నప్పుడు.. ‘ఇంత మంచి సినిమా, ఎంతో బాగా చేశారు. దీన్ని ట‌చ్ చేయ‌కండి’ అని నా ఒపీనియ‌న్ చెప్పాను. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నార‌ని నా ద‌గ్గ‌ర ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ తెలుగులో ఈ సినిమాను తీయ‌కూడ‌ద‌ని నేను చెప్పేవాడిని. కానీ..  ఈ సినిమాలో శ‌ర్వానంద్‌, స‌మంత చేస్తున్నార‌ని అనౌన్స్ చేయ‌గానే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. త‌మిళంలో నేను ఏదైతే చూశానో అదంతా పోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే శ‌ర్వా, సామ్‌లే గుర్త‌కొస్తున్నారు. త‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాబ‌ట్టి ఫీల్ ఎక్క‌డా మిస్ అయ్యుండ‌దు. శ‌ర్వా.. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చినప్పుడు నా తొలి ఫ్రెండ్. శ‌ర్వా, సామ్ ఇద్ద‌రూ మంచి పెర్ఫామెర్స్‌. పోటీ ప‌డి న‌టించారు. శ‌ర్వా ఏ సినిమా చేసినా స‌రే! వాడికి మాత్రం చాలా మంచి పేరు వ‌స్తుంటుంది. ఈ సినిమాకు మంచి పెర్ఫామర్ అవ‌స‌రం. అందుక‌నే త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తిని, తెలుగులో శ‌ర్వానంద్‌ని తీసుకున్నారు. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. త‌న‌ను చూసి.. త‌ను ఎంచుకుంటున్న సినిమాల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప్ర‌తి సంవత్స‌రం ప‌ది మంచి సినిమాలున్నాయంటే అందులో రెండు, మూడు స‌మంత సినిమాలుంటున్నాయి. ఇప్పుడు త‌న లిస్టులో మ‌రొక‌టి జాయిన్ అవుతుంది. రాజుగారి కౌంటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యింది. మ‌ళ్లీ ఫిబ్రవ‌రి 7 నుండి మళ్లీ స్టార్ట్ అయ్యి మార్చి 25వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. అక్క‌డి నుండి నేను చూసుకుంటా. అలాగే శిరీష్‌గారికి కంగ్రాట్స్‌. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాదు.. రాజుగారికి ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొన్ని సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తాం. కొన్నింటిని ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. ఇంటికి కూడా తీసుకెళ‌తాం. అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాల్లో ‘జాను’ ఒక‌టి. ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa