"జాను" సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ లో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘మా బ్యానర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్లలో మేం ఎప్పుడూ రీమేక్ చేయనేలేదు. మా బ్యానర్‌లో వస్తోన్న తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు భయం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెరపైకి తీసుకురావడం చాలా కష్టం. తమిళంలో ‘96’ సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన తర్వాత ప్రివ్యూ థియేటర్ నుండి బయటకు రాగానే ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ.. ప్రొడ్యూసర్‌కి చెక్ ఇచ్చేశాను. అందుకు కారణం సినిమా చూసే సమయంలో ఎమోషన్స్‌తో గుండె బరువెక్కింది. అప్పుడు మా ‘ఎంసీఏ’ షూటింగ్ జరుగుతుంది. ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకుంటున్నానని నానితో చెప్పాను. తను కూడా చెన్నై వెళుతున్నానని చెప్పాడు. అప్పుడు తన కోసం ఓ షో ఏర్పాటు చేస్తే.. తను సినిమా చూసి సినిమా ‘క్లాసిక్ సినిమా సార్! చాలా బావుంది’అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తమిళంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్లీ ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూశాను. నాకు తమిళంలో పూర్తిగా రాకపోయినప్పటికీ ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎవరు ఏమనుకున్నా..ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాను. జానుగా సమంతను ఈ సినిమాలో యాక్ట్ చేయించాలని అనుకున్నాను. తనని తప్ప.. ఆ పాత్రలో మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేకపోయాను. ఈ మధ్య తను చేస్తున్న సినిమాలన్నీ సూపర్బ్‌గా సెలక్ట్ చేసుకుంటుంది. తనతో మాట్లాడి సినిమాకు ఒప్పించాను. ఇక నా బ్రదర్ శర్వాకి ఫోన్ చేసి సినిమా చూడమంటే సినిమా చూసి సూపర్బ్‌గా ఉందని ఫోన్ చేశాడు. అలా శర్వా, సమంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మా ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ‘96’ సినిమాకు డైరెక్టర్‌గా మారాడు. తమిళంలో సినిమా చేసిన తనతో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయమని చెప్పాను. తమిళంలో చేసిన టెక్నీషియన్సే ఈ సినిమాకు పనిచేశాను. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కెన్యాలో శర్వా నడుపుతున్న జీపు బోల్తా పడింది.. దేవుడి దయవల్ల తనకు ఏమీ కాలేదు. తర్వాత మరో డిస్ట్రబెన్స్ వచ్చింది. ఏంటి? ఇంత మంచి సినిమాకు ఇన్ని అడ్డంకులు? అని అనుకున్నాను. అయితే అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ వచ్చి సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాను చేస్తున్నప్పుడు ‘దిల్‌రాజుకేమైనా మెంటలా? డబ్బింగ్ చేయొచ్చు కదా?’ అని చాలా కామెంట్స్ విన్నాను. ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవర్‌ను డైరెక్టర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్రవరి 7న మా ‘జాను’ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఈ సినిమా హ్యాంగోవర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన తర్వాత మన లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్రవరి 7న నేను చెప్పినవన్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa