ఆస్కార్.. ఈ అవార్డుకు ఉన్న క్రేజ్ ప్రపంచంలోని ఏ చిత్ర పురస్కారాలకు లేదు. దీనిని ప్రధానంగా హాలీవుడ్ చిత్రాలకే ఇచ్చిన అన్ని దేశాల చిత్రపరిశ్రమలు, సినీ అభిమానులు ఆస్కార్ అవార్డులపై ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే, ఈ ఏడాది కూడా ఆస్కార్ సంబరాలకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. దీంతో అవార్డును సొంతం చేసుకునేందుకు ఎంతో మంది నటీనటులు మక్కువ ప్రదర్శిస్తోన్నారు. ఈ మేరకు 15 కేటగిరీల్లో నామినేషన్లు ప్రకటించారు. ఇక అసలు విషయానికొస్తే, ఈసారి ఉత్తమ నటుడు కేటగిరీలో లియొనార్డో డికాప్రియో, ఆంటోనియో బండెరాస్‌లు పోటీపడుతున్నారు. 'పెయిన్ అండ్ గ్లోరీ' చిత్రంలో బండెరాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అటు 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్రంతో డికాప్రియా మరోసారి అలరించాడు. ఇదే కేటగిరీలో ఆడమ్ డ్రివెర్ (మ్యారేజ్ స్టోరీ), జాక్విన్ ఫోనిక్స్ (జోకర్), జోనాథన్ ప్రైసీ (ది టూ పోప్స్) కూడా ఉన్నారు. ఇతర ప్రధాన కేటగిరీల విషయానికొస్తే.... ఉత్తమ చిత్రం నామినేషన్లు: జోకర్, మ్యారేజ్ స్టోరీ, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్, పారాసైట్, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్, లిటిల్ ఉమెన్, 1917. ఉత్తమ దర్శకుడు నామినేషన్లు: క్వెంటిన్ టరాంటినో (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), మార్టిన్ స్కోర్సెస్సి (ది ఐరిష్ మ్యాన్), టాడ్ ఫిలిప్స్ (జోకర్), బాంగ్ జున్ హో (పారాసైట్), శామ్ మెండెస్ (1917). ఉత్తమ నటి నామినేషన్లు: రెనీ జెల్వెగర్ (జూడీ), చార్లీజ్ థెరాన్ (బాంబ్ షెల్), సింతియా ఎరివో (హ్యారియెట్), స్కార్లెట్ జాన్సన్ (మ్యారేజ్ స్టోరీ)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa