2019లో సక్సెస్ రేటులో కాస్త వెనుకబడిన టాలీవుడ్ కి 2020 అచ్చొచ్చిందనే చెప్పుకోవాలి. 2020లో సంక్రాతి కానుకగా బడా హీరోల సినిమాలు విడుదలయ్యాయి. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో', సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. జనవరి మొత్తానికి టాలీవుడ్ పాజిజీవ్ వీవెన్ తోనే వుంది. ఇక ఫిబ్రవరి తొలి వారంలో ఐదు సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. ఈ ఆర్ సినిమాలలో తమిళ సూపర్ హిట్ చిత్రం 96కి రీమేక్‌గా తెరకెక్కిన 'జాను'.. జబర్ధస్త్ నటులు సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శీను ప్రధాన పాత్రలలో రూపొందిన '3 మంకీస్'.. నందు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సవారి'.. మరియు 'డిగ్రీ కాలేజ్'.. 'స్టాలిన్'.. సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఐదు సినిమాలలో శర్వా- సమంత నటిస్తున్న '96' రీమేక్ జాను సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. మరి ఈ ఐదు చిత్రాలలో ఏ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందో చూడాలి..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa