ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ లేకుండా జీవితమే లేదు : దిశా పటాని

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2020, 05:39 PM

ప్రేమ లేకుండా జీవితమే లేదంటోంది బాలీవుడ్‌  సుందరి దిశా పటానీ. చూడగానే పుట్టే ప్రేమను తాను నమ్ముతానని చెబుతోంది. మనమే పని చేసినా ప్రేమ కోసమో, ప్రేమ వల్లో చేస్తామని సెలవిస్తోంది. ఈ భామ ప్రస్తుతం మలంగ్‌ అనే చిత్రంలో నటిస్తోంది. అనిల్‌ కపూర్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌లతో నటిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. చూస్తే సరదా అమ్మాయిలా కనిపించే దిశాలో లోతైన ప్రేమకోణం ఉంది. ఆమె మాటల్లో ప్రేమ గురించి వింటే….ప్రేమలో చిన్న చిన్న విషయాలు కూడా ముఖ్యమే. మన జీవితాల్లో ప్రేమ అనేది ముఖ్యం. మనల్ని నడిపే శక్తి ప్రేమే. మనమేం చేసినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రేమే కారణం అయి ఉంటుంది. ప్రేమ లేకుండా ఉండగలమా.? తొలి చూపుకే ప్రేమలో పడటాన్ని నేను నమ్ముతా. నేనూ ఒకసారి అలా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌కు గురయ్యా. తొలి ప్రేమ అంటే ఒళ్లు పులకరించినట్లు ఉండే సందర్భమది. అలా లేదంటే మీలో తొలి ప్రేమ పుట్టలేదన్నట్లే. ఒకబ్బాయితో కలిసి ఉన్నప్పుడే నేనో అమ్మాయిని అని గుర్తొస్తుంది. అలా గుర్తు చేసే వాడి కోసం వేచి చూస్తున్నా. ప్రేమలో చిన్న చిన్న విషయాలకు కూడా ప్రాము ఖ్యత ఉంటుంది. వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఒకసారి ప్రేమలో విఫలమయ్యా. అని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa