హాసిని అండ్ హారిక బ్యానర్ తో కలిసి స్టార్ నటుడు ఎన్టీఆర్ తన 30వ సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీని నటుడు..ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అన్న కళ్యాణ్ రామ్ ను ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా చేశాడు ఎన్టీఆర్. తమ్ముడు సినిమాను మరోసారి నిర్మించబోతున్న కళ్యాణ్ రామ్ తన బ్యానర్ లో చిన్న చిన్న మార్పులు చేశాడట. కళ్యాణ్ రామ్ బ్యానర్ పేరు ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటూ ఉంటుంది. ఈ బ్యానర్ లో గతం లో వచ్చిన సినిమాల పోస్టర్స్ పై తెలుగులో ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటూ ఉండేది. అలాగే ఎన్టీఆర్.. బసవతారకం గార్ల ఫొటోలు ఉండేవి. కాని ఆ లోగోను కాస్త మార్చాడు. ఎన్టీఆర్ ఫొటోను మాత్రమే పెట్టి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ అంటూ ఇంగ్లీష్ లో పెట్టాడు. కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ల కలయిక లో ఇది కొత్త బ్యానర్ అయ్యి ఉంటుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కొందరు మాత్రం ఫ్లాప్ లను తప్పించుకునేందుకు కళ్యాణ్ రామ్ ఇలా కొత్తగా ట్రై చేసినట్లు గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa