ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయనతో గడిపిన ఆ క్షణాలు వెలకట్టలేనివి : నితిన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 09:40 PM

ఇటీవల విడుదలై 'భీష్మ' చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరికొన్నిరోజుల్లో పెళ్లికొడుకు కాబోతున్న నితిన్ కు ఈ సినిమా ముందస్తు కానుక అని చిత్ర వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను 'భీష్మ' చిత్ర బృందం కలిసింది. హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, 'సితార ఎంటర్టయిన్ మెంట్స్' నాగవంశీ పవన్ ను కలిసి తమ ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నితిన్ ట్వీట్ చేశారు. 'భీష్మ' చిత్రం ఘనవిజయం సాధించినందుకు చిత్రబృందాన్ని పవర్ స్టార్ అభినందించారని వెల్లడించారు. పవన్ తో గడిపిన ఆ క్షణాలు వెలకట్టలేనివని సంతోషంతో పొంగిపోయారు. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం సర్ అంటూ తన ఆరాధ్య హీరోపై అభిమానాన్ని ప్రదర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa