విష్వక్సేన్ కథానాయకుడిగా శైలేశ్ కొలను దర్శకత్వంలో 'హిట్' సినిమా నిర్మితమైంది. నాని సమర్పణలో రూపొందిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఎల్లుండి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఆ మిస్టరీని ఛేదించే ఆఫీసర్ గా విష్వక్సేన్ కనిపించనున్నాడు.
ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి. రుహాని శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఎల్లుండి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకంతో విష్వక్సేన్ వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో రుహాని శర్మ వుంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa