గురు పవన్ దర్శకత్వంలో ఓ మూవీని చేస్తున్నాడు నటుడు సుమంత్ అశ్విన్ . ఈ చిత్రంలో ప్రియా వడ్లమని హీరోయిన్. నటులు శ్రీకాంత్, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్ నెం .1గా రాబోతున్న ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సినిమాని నిర్మాత జి మహేష్ నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తుండగా.. రామ్ ప్రసాద్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa