ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ చెప్పకుండా ముద్దుపెట్టాడు : రేఖ

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 02:22 PM

కె.బాలచందర్‌ దర్శకత్వంలో 1986లో వచ్చిన 'పున్నగై మన్నన్‌' సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను ఓ ఇంటర్వ్యూలో నటి  రేఖ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో కమల హాసన్‌ సరసన రేఖ నటించారు. ఓ ముద్దు సన్నివేశాన్ని దర్శకుడు తీస్తోన్న సమయంలో ఆ విషయం గురించి తనకు స్పష్టంగా చెప్పలేదని ఆమె తెలిపారు.


తన అనుమతి తీసుకోకుండానే బాలచందర్‌ చెప్పినట్లుగా కమలహాసన్‌ తనని ముద్దు పెట్టుకున్నారని ఆమె చెప్పారు. ముద్దు సన్నివేశమన్న విషయాన్ని ముందే చెబితే  తాను అంగీకరించేదాన్ని కాదని తెలిపారు. ఆమె ఆ విషయాన్ని చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో కమలహాసన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఆమెకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటున్నారు.  సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఇంతగా వైరల్ అవుతుండడం పట్ల రేఖ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోసారి స్పందిస్తూ తన అనుమతి లేకుండానే వాళ్లు ముద్దు సన్నివేశాన్ని తీసినప్పటికీ, ఆ సన్నివేశం ఆ సినిమాకి ఎంతగానో ఉపయోగపడిందని ఆమె తెలిపింది. ఆ సినిమాలోని ఈ సన్నివేశాన్ని కూడా ఇప్పుడు నెటిజన్లు ఆసక్తికరంగా వెతికి మరీ చూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa