ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ముగ్గురికి "గ్రీన్ ఛాలెంజ్" చేసిన ఖుష్బూ...

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2020, 12:38 PM

తమిళనాడు కాంగ్రెస్ నేత, ప్రముఖ సినీ నటి ఖుష్బూ తన ‘గ్రీన్ ఛాలెంజ్’ను పూర్తి చేశారు. మూడు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మరో ముగ్గురు సెలెబ్రెటీలకు ఆమె గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, ‘రోజా వనం’ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఖుష్బూ మూడు మొక్కలు నాటారని చెప్పారు. సినీ నటులు మీనా, సుహాసిని, డ్యాన్సర్ బ్రిందాకు ఖుష్బూ గ్రీన్ ఛాలెంజ్ విసిరారని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ‘మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని రక్షించుకుందాం’ స్లోగన్ ని చేశారు. ఖుష్బూ మొక్క నాటుతున్న సమయంలో ఆమెకు రోజా సాయపడుతున్న వీడియోను, అదేవిధంగా, ఖుష్బూ మాట్లాడుతున్న మరో వీడియోను రోజా పోస్ట్ చేశారు. ఖుష్బూ, రోజాలు కలిసి సెల్ఫీ దిగడం కూడా ఈ వీడియోలో కనబడుతుంది.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa