విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'అల్లరి' నరేశ్ కథానాయకుడిగా 'నాంది' సినిమా నిర్మితమవుతోంది. ఆల్రెడీ ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో హరీశ్ ఉత్తమన్ కనిపించనున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని 'అల్లరి' నరేశ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa