ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ కొత్త సినిమా టైటిల్...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2020, 12:54 PM

తాజాగా నిఖిల్ తిరుపతిలో కార్తికేయ-2 సినిమా షూటింగ్ ప్రారంభించాడు. అయితే ఈరోజు మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నిఖిల్ హీరోగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కొద్దిసేపటి కిందట కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించాడు. స్క్రీన్ ప్లే కూడా అతడే సమకూర్చి పెట్టాడు. సూర్యప్రతాప్ దర్శకత్వం మాత్రం వహిస్తాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సుకుమార్ సహ-నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. ఎప్పట్లానే అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తారు. ఈ సినిమాకు "18 పేజెస్" అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు. అటు కార్తికేయ-2, ఇటు '18 పేజెస్' సినిమాలకు సైమల్టేనియస్ గా కాల్షీట్లు కేటాయించాడు నిఖిల్. ఈ రెండు సినిమాలు తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతాయని భావిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa