పద్మావత్' విడుదలపై తమ తీర్పు మారదని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు 'పద్మావత్' విడుదల చేయాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలని రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో 'పద్మావత్' యూనిట్‌కు ఊరట లభించినట్లైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమా స్పెషల్ షోను చూసేందుకు కర్ణిసేన కార్యకర్తలు కూడా దిగొచ్చిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa