ప్రస్తుతం బోయపాటి - బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎందరో హీరోయిన్లతో సంప్రదింపులు జరిపారు. తాజాగా హాట్ భామ పాయల్ రాజ్ పుట్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై తాజాగా పాయల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను బాలకృష్ణ సినిమాలో నటించడంలేదని.. నేను బాలకృష్ణ - బోయపాటి సినిమాకు సైన్ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లని తెలిపింది. ప్రస్తుతం పాయల్ ఒక సినిమాలో పోలీసు పాత్ర చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa