మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా “రంగస్థలం” టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. చిట్టిబాబు అనే క్యారెక్టర్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగా, ఈ టీజర్ లో తాను కనిపించనందుకు, సమంత మనోభావాలు దెబ్బతిన్నాయా? అన్న సిగ్నల్స్ ను ఇచ్చింది. ప్రత్యక్షంగా ఎలాంటి కామెంట్ చేయలేదు గానీ, ట్విట్టర్ లో ఓ అభిమాని చేసిన పోస్ట్ కు ఇచ్చిన రిప్లై అలాంటి సందేహాలకు తావిచ్చింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ తారామణి, ‘రంగస్థలం’ టీజర్ రిలీజ్ తర్వాత వస్తున్న ఫీడ్ బ్యాక్ కు కృతజ్ఞతలు చెప్తోంది. ఈ టీజర్ లో తమ అభిమాని కనిపించనందుకు, తామే పెట్టుకున్నామంటూ రామ్ చరణ్ ను పక్కన సమంతను కూర్చోపెట్టి ఓ ఫోటోను అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో సదరు ఫోటోకు ముగ్దురాలైన సమంత, ఆనందంతో పరవశిస్తూ రిప్లై ఇచ్చింది. తన ఫ్యాన్స్ కే కాదు, బహుశా తనక్కూడా అలాంటి భావనే ఉందేమో గానీ, ఈ రిప్లై వైరల్ అయ్యింది. అయితే ఇది చూసిన అనసూయ అభిమానులు కూడా మరికాసేపటికి ఈ టీజర్ లో సమంతతో పాటు అనసూయ కూడా కనిపించలేదని ఓ ట్వీట్ ను పోస్ట్ చేయగా, దానికి అనసూయ కూడా రిప్లై ఇచ్చింది. ఈ టీజర్ బాగున్నప్పటికీ, సమంత, అనసూయ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది అంటూ ఓ ఫ్యాన్ ఇచ్చిన పోస్ట్ కు, ‘డోంట్ వర్రీ, దీనికంటూ ఓ కారణం ఉంటుంది, ప్రస్తుతం మన చిట్టిబాబును చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటూ’ రిప్లై ఇచ్చింది. అసలు హీరోయిన్ సమంతే కనిపించలేదంటే, సైడ్ రోల్ చేసిన అనసూయ కూడా కనిపించలేదని పోస్ట్ చేయడం మరీ ఓవర్ గా లేదు అనడం నెటిజన్ల వంతవుతోంది.
— Samantha Akkineni (@Samanthaprabhu2) January 24, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa