ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సుకుమార్, బన్నీ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 12:46 PM

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్నపాటి షెడ్యూల్ ను పూర్తిచేశారు. అల్లు అర్జున్ ఇంతవరకూ షూటింగులో పాల్గొనలేదు. కరోనా ప్రభావం తగ్గగానే ఈ సినిమా షూటింగు మొదలుకానుంది. స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. లారీ డ్రైవర్ గా మాస్ లుక్ తో బన్నీ కనిపించనున్నాడని అంటున్నారు.యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా ఈ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నారు. 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బన్నీ, 'రంగస్థలం' వంటి భారీ విజయం తరువాత సుకుమార్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు వున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa