జాతీయస్థాయి హీరోలుగా సల్మాన్ .. షారుక్ లకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీమాన్ గా సల్మాన్ .. రొమాంటిక్ కింగ్ గా షారుక్ ప్రేక్షకుల హృదయాలపై బలమైన ముద్రను వేశారు. అలాంటి ఈ అగ్రహీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో అంచనాలను అందుకోలేకపోయాయి. ఆయా సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా, పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దాంతో ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కథానాయకులతో దర్శకుడు నిఖిల్ అద్వాని ఒక భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో 'కరణ్ అర్జున్' సంచలన విజయాన్ని సాధించింది. మరోసారి ఇదే కాంబినేషన్లో సినిమా రానుందంటే అది అభిమానులకు పెద్ద పండగే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa