ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జల్సా కంబో రిపీట్ పవన్ తో గోవా బ్యూటీ ఇలియానా..

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2020, 12:56 PM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో గోవా బ్యూటీ ఇలియానా రొమాన్స్ చేయనుందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. రెండేళ్ల పాటు రాజకీయాలతో బిజీగా ఉండి ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు పవన్ కళ్యాణ్. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూనే సినిమా షూటింగ్స్ త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న 'వకీల్ సాబ్' సినిమాలో సీనియర్ హీరోయిన్ ఇలియానాకు అవకాశం కల్పించారని తెలుస్తోంది.వేణుశ్రీరాం దర్శకత్వంలో ప్రస్తుతం పవన్ 'వకీల్ సాబ్' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుందంటూ నిన్నటివరకు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇలియానాను దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa