ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడాకుల పుకార్ల పై క్లారిటీ ఇచ్చిన 'కలర్స్' స్వాతి!

cinema |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 12:22 PM

ఫేమస్ యాంకర్, నటి స్వాతి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తాయని, భర్తతో ఆమె విడాకులు తీసుకోబోతోందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. రోజురోజుకూ దీనిపై టాలీవుడ్ జనాల్లో చర్చ ముదురుతోంది. కొంతకాలం క్రితం పైలెట్ వికాస్ వాసును వివాహం చేసుకున్న 'కలర్స్' స్వాతి, అతన్నుండి విడిపోనుందని ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయగా, స్వాతి స్పందించింది. గతంలో ఇలియానా, సనా ఖాన్ తదితర హీరోయిన్స్ తమ బాయ్ ఫ్రెండ్స్ నుంచి విడిపోయిన తరువాత, వారితో కలిసున్నప్పుడు దిగిన ఫోటోలను తమతమ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. తాజాగా స్వాతి సైతం వికాస్ తో కలిసున్న చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి తీసేసింది.ఇంకేముంది, ఆమె భర్తకు దూరమైందని, విడాకులు తీసుకోనుందని పుకార్లు బయలుదేరాయి. వీటిపై వివరణ ఇచ్చిన స్వాతి, అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. భర్తతో తాను దిగిన చిత్రాలను ఆర్కివ్స్ లో దాచుకున్నానని చెబుతూ, తన స్మార్ట్ ఫోన్ లోని వాటిని చూపిస్తూ, ఓ చిన్న వీడియోను తీసి, దాన్ని పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ కు హారీపోటర్ డైలాగ్ ను కామెంట్ గా పెట్టింది. ఇక ఇప్పటికైనా స్వాతి దాంపత్య జీవితంపై వస్తున్న రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa