భారత్ లో మహమ్మారి కరోనా కేసులు రోజురోజుకు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ ని నివారించడానికి మన ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వైరస్ వ్యాప్తి ఆగడం లేదని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో ఓ తీపి జ్ఞాపకం పంచుకున్నారు. అమ్మ అంజనీ దేవి గారితో పాటు ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెళ్ళతో కలిసి దిగిన ఫోటో పంచుకొని వారిని బాగా మిస్ అవుతున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ కి ముందు అంజనీ దేవి పిల్లలందరూ కలిసి కూర్చుని దిగిన ఆ ఫోటో చాల ఆహ్లాదంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమంలో భాగంగాప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించగా అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరిఇళ్లలో వాళ్లు ఉంటున్నారు. చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఆదివారం ఓ చోట కలవడం అనే ఆనవాయితీ ఉంది. ఈ లాక్ డౌన్ తో వారిని కలవలేని పరిస్థితి.ఇక చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తి కాగా, వచ్చే నెలలో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa