దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఉగాది సందర్భంగా కీలక ప్రకటన వెలువడనుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తీసిందే. గత నెలలో పూణే లో మొదలు కావాల్సిన షెడ్యూల్ నిలిచిపోయింది. హీరోయిన్ అలియాభట్ మరియు చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరగాల్సివుంది. కాగా ఈ లాక్ డౌన్ సమయాన్ని రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం వినియోస్తున్నాడట. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన కథతో పాటు మెరుగైన సన్నివేశాల గురించి ఆలోచిస్తున్నాడట. ఈ విషయాన్ని రాజమౌళి తాజా ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు.మహాభారతం అనేది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంది. బాహుబలి సినిమాకు ముందే ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. సౌత్ నార్త్ లోని స్టార్ హీరోలతో భారీగా ఈ మూవీని ఆయన నిర్మించనున్నారు ఇక ఆయన ప్రస్తుత ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. డి వి వి దానయ్య 400కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జనవరి 8, 2021లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa