స్వామి రారా సినిమా ద్వారా మంచి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సీనియర్ కమెడియన్స్ ని మరిపిస్తున్న సత్య కెరీర్ మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారట. దర్శకుడవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సత్య ఊహించని విధంగా నటుడిగా మారిపోయాడు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు.తెలుగులో హాస్య నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారి జాబితాలో సత్య కూడా కనిపిస్తాడు. 'స్వామిరారా' సినిమా నుంచి కమెడియన్ గా దూసుకెళుతూ, యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రంగా వున్న సమయంలో 'జబర్దస్త్' చేయడం మొదలుపెట్టాను. ధన్ రాజ్ టీమ్ లో స్కిట్స్ చేస్తూ వెళ్లాను.'జబర్దస్త్' నాకు మంచి గుర్తింపు తెచ్చింది .. మంచి పారితోషికం కూడా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సినిమాల్లో అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. అయితే వాటిని నమ్ముకుని జబర్దస్త్ వదిలేయడమనేది సాహసంతో కూడిన పనే. అయినా తెగించి 'జబర్దస్త్' మానేశాను. అదృష్టం కొద్దీ ఆ తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు. అలా వచ్చిన పాత్రలు నన్ను నేను నిరూపించుకునేవి .. నిలదొక్కుకునేవి కావడం మరో అదృష్టం. నా తాజా చిత్రాలుగా 'రెడ్' .. 'సోలో బ్రతుకే సో బెటర్' .. 'శ్రీకారం' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa