ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ భాషలను ప్రాక్టీస్ ఎన్టీఆర్ చేస్తున్నాడట !

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 22, 2020, 12:06 PM

కరోనా లాక్ డౌన్ తో వచ్చిన ఖాళీ సమయాన్ని ఎన్టీఆర్ ఇలా వేరే భాషలు నేర్చుకోవడానికి పూర్తిగా సమయాన్ని కేటాయిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మలయాళ వర్షన్ కి కూడా డబ్బింగ్ చెప్పడానికి ఆ భాష పై పట్టు సాధిస్తున్నాడట. రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రౌద్రం రణం రుధిరం’ కోసం తార‌క్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ భాష‌ల్లో కూడా డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నారు. చరణ్ బర్త్ డే వీడియోకి ఎన్టీఆర్ ఒక్క మలయాళ భాషలో తప్ప అన్ని భాషల్లో డబ్బింగ్ కూడా చెప్పారు. కాగా తాజాగా మ‌ల‌యాళ భాష కూడా ఎన్టీఆర్ నేర్చుకుంటున్నాడట.. డబ్బింగ్ చెప్పడానికి వీలుగా ప్రస్తుతం ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa