విశ్వ విఖ్యాత నట స్వారభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. తేజ దర్శకుడు.
ఎన్టీఆర్ జీవితం ఓ కథగా చెప్పాల్సి వస్తే భార్య బసవతారకం పాత్రకి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో సవతారకం పాత్రకు గానూ చాలామంది కథానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా చిత్రబృందం నిత్యమీనన్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది.
అయితే ముందు ఈ కథలో నటించడానికి ‘ఓకే’ చెప్పేసిన నిత్య.. ఒకట్రెండు రోజుల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఐతే దీనికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. మొదట నిత్యను అనుకున్న దర్శకుడు ఇప్పుడు నో చెప్పడంతో మరో కధానాయిక వేటలో పడ్డాడని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa