మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ''ఉప్పెన''లో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.లాక్ డౌన్ సమయంలో థియేటర్లు బంద్ కావడంతో విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలకు ఓటీటీ ప్లేయర్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రానికి కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ నుంచి 14 కోట్ల వరకు ఆఫర్ వెళ్లిందట. అయితే, చిత్ర నిర్మాణానికి అంతకంటే బాగా ఎక్కువ ఖర్చుపెట్టడం వల్ల తమకు వర్కౌట్ కాదని భావించిన చిత్ర నిర్మాతలు ఆఫర్ ని తిరస్కరించినట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa