టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు.మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే అవకాశం వుంది. ప్రస్తుతం నిర్మాతలు ఈ విషయంలో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa