చూడచక్కని రూపం, చక్కని హావభావాలతో ప్రేక్షకులను మెప్పించిన అగ్రకథానాయికల కీర్తి సురేష్ ఎప్పుడూ ఫొటోషూట్, సినిమా ప్రమోషన్లకు సంబందించిన ఫొటోలను ఆకట్టుకునే కీర్తి తాజాగా మేకప్ ప్రీ లుక్ లో ఉన్న ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 50 లక్షలను దాటగా, ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి, ఆమె ఓ వీడియో తయారు చేసి పోస్ట్ చేసింది.ఈ వీడియోలో కీర్తీ సురేశ్ మేకప్ లేకుండా కనిపించడం గమనార్హం. తన పెట్ డాగ్ తో కలిసి ఈ వీడియోను రూపొందించింది. మనది ఇప్పుడు 50 లక్షల మందితో నిండిన కుటుంబమని, తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం కీర్తి, 'పెంగ్విన్', 'మిస్ ఇండియా', 'రంగ్ దే' తదితర చిత్రాల్లో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమాల షూటింగ్, ప్రీ ప్రొడక్షన్ పనులు నిలిచిపోగా, నిబంధనలు తొలగిపోగానే కీర్తి బిజీ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa