ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది. చూసిన వారందరికీ షాకిస్తోంది. దానికి కారణం ఇద్దరు మగవాళ్లు లిప్‌కిస్ పెట్టుకోవడమే. `కృష్ణ అండ్ హిజ్ లీలా` డైరెక్టర్ రవికాంత్, హీరో సిద్దూ జొన్నలగడ్డ ఇలా లిప్‌కిస్ పెట్టుకుంటూ దర్శనమిచ్చారు. ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది.
ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధూ సరసన శ్రద్ధా శ్రీనాథ్, షాలిని వడ్నికట్టి నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కోసమే రవికాంత్, సిద్ధూ ఇలా చేసినట్టు సమాచారం. ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. రానా దగ్గుబాటి సమర్పణలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa