ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ తమిళ రీమేక్ కు బ్రేక్ ఇచ్చిన అమీర్ ఖాన్...?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 04:17 PM

మాధవన్, విజయ్ సేతపతి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `విక్రమ్ వేద`. 2017లో విడుదలైన ఈ తమిళ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయాలని అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ భావించారు. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. అయితే ఆమిర్ ప్లాన్స్‌కు కరోనా అడ్డుపడింది.


ప్రస్తుతం ఆమిర్ `లాల్ సింగ్ చద్దా` సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ పూర్తవలేదు. ఇంకా సగభాగం మిగిలి ఉంది. దీంతో 2021 క్రిస్మస్‌కు `లాల్ సింగ్ చద్దా`ను వాయిదా వేయాలనుకుంటున్నాడట. ఆ తర్వాతే `విక్రమ్ వేద`ను ప్రారంభించాలనుకుంటున్నాడట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa