రాజ్ కుమార్ దర్శకత్వంలో నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఐపిసి 367. ఈ సినిమాలో నందిత పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. తాజాగా చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాళ్లుగా మారిన వేళ ఆ సవాళ్ళను పోలీస్‌గా నందిత ఎలా పరిష్కరించిందనేది కథాంశం. ఒకవైపు సైన్స్ గొప్పతనాన్ని చెబుతూనే అతీంద్రీయ శక్తులను చూపించాడు దర్శకుడు. అమ్మాయిలను బతకనివ్వరా అంటూ ట్రైలర్‌లో నందిత చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa