గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పలువురు ప్రముఖులు మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దీనిని ప్రారంభించారు. ఇటీవల ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత మొక్కనాటి హీరోయిన్ రష్మిక మందనకు ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీకరించిన రష్మిక మొక్కలు నాటింది. హీరోయిన్లు రాశిఖన్నా,కళ్యాణి ప్రియదర్శన్ లకు రష్మిఖ ఛాలెంజ్ విసిరారు. అదే విధంగా తన అభిమానులు,యువత పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రష్మిక పిలుపునిచ్చారు. తనను ఈ ఛాలెంజ్ లోకి ఆహ్వానించినందుకు సమంతకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa